11, జనవరి 2010, సోమవారం

గూగుల్ రీడర్ పరిచయం



యూఆర్ఎల్: http://www.google.co.in/reader/

గూగుల్ రీడర్ అనేది వెబ్‌సైట్లను/బ్లాగుల్లో ప్రచురించే సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక ఆన్ లైన్ ఉపకరణం. కావలసిందల్లా ఆ వెబ్ సైటులో కొత్త సమాచారాన్ని చేర్చినప్పుడల్లా అది ఫీడ్ ను(ఉదా. RSS లేదా Atom ఫీడు) ఉత్పత్తి చేయగలిగి ఉంటే చాలు. ప్రస్తుతం మన బ్లాగులన్నీ ఇలాంటి ఫీడ్లను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి సమస్య లేదు. ఉదాహరణకు టెక్ చిట్కా బ్లాగును నేను అనురించాలనుకుంటున్నాననుకోండి. ఈ క్రింది విధంగా చెయ్యండి.
ముందుగా పైన సూచించిన URL కి వెళ్ళండి. రీడర్ లోకి ప్రవేశించడానికి మీ గూగుల్ ఖాతా అవసరమౌతుంది.
Add a subscription మీద క్లిక్ చెయ్యండి. పాఠ్యపు పెట్టెలో (టెక్స్ట్ బాక్స్) URL ఎంటర్ చేసి Add అనే బటన్ మీద నొక్కండి. అంతే..


మీరు చదవాలనుకున్న బ్లాగులను అనుసరిస్తే (Subscribe చేసుకుంటే) సదరు బ్లాగుల్లో కొత్త టపా పడినప్పుడల్లా మీకు తెలియబరచబడుతుంది.



ఒక వేళ మీరు ఆ బ్లాగును అనుసరించడం మానేయలనుకుంటే క్రిందివిధంగా చెయ్యండి.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి