14, ఏప్రిల్ 2010, బుధవారం

టపాలకు అలంకరణలు

చాలా మంది బ్లాగర్లు లేఖిని లోనో బరహా లోనో టపాలను టైప్ చేసేసి దాన్ని తీసుకువచ్చి ఇక్కడ అతికించేసి ప్రచురించేసి చేతులు దులిపేసుకుంటారు.
అయితే ఈ క్రింది చూపిన పటం చూడండి. రౌండప్ చేసిన భాగంలో పాఠ్యాంశాన్ని ఆకర్షణీయంగా చేయడానికి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఉదాహరణకు T లాగా కనిపిస్తున్న ఐకాన్ మీద నొక్కితే పాఠ్యం పరిమాణం పెంచవచ్చు. దాని తరువాత కనిపించే రెండు ఐకాన్లనుపయోగించి బొద్దు అక్షరాలు, వాలు అక్షరాలు గా మార్చవచ్చు. అలాగే అక్షరాలకు రంగులద్దవచ్చు. టపాలోని పదాలకు లంకెలివ్వచ్చు (నేను లేఖిని, బరహాకు ఇచ్చినట్లుగా)
పాఠ్యం పుటలో కుడి వైపున ఉండాలా, ఎడమ వైపున ఉండాలా, మధ్యలో ఉండాలో ఎంచుకోవచ్చు. పాయింట్ల రూపంలో రాయవచ్చు. ఇలా ఎన్నెన్నో చేయవచ్చు. కాబట్టి ఈ సారి నుంచి టపాలు రాసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయని మరిచిపోకండి సుమా...