16, డిసెంబర్ 2009, బుధవారం

‌ఫేస్‌బుక్ (Facebook) తెలుగులో రావాలంటే...



మీరు ఫేస్‌బుక్ లోకి ప్రవేశించిన తర్వాత Settings లోకి వెళ్ళి Language జారుడు జాబితా నుంచి తెలుగును ఎంచుకోండి.
అంతే మీ ఫేస్‌బుక్ పుట తెలుగులో దర్శనమిస్తుంది.

13, డిసెంబర్ 2009, ఆదివారం

ఫైర్ ఫాక్స్ లో తెలుగు టైపింగ్



మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ కనుక వాడుతున్నట్లయితే తెలుగులో టైపు చెయ్యడానికి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ (Indic Input Extension)‌‌ అనే యాడాన్ ఉంది. దీనిని ఉపయోగించి మీరు లేఖిని, బరహా లాంటి పరికరాలలో టైపు చేసి, కాపీ పేస్ట్ చెయ్యనవసరం లేకుండా వెబ్‌సైటులో డైరెక్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ టైపు చేసుకోవచ్చు.

జీ మెయిల్ తెలుగులో



ఇలా మీ జీమెయిల్ కూడా తెలుగులో కనిపించాలనుకుంటున్నారా? మీ జీమెయిల్ పై భాగం లో ఉన్న సెట్టింగ్స్ అనే లింక్ మీద నొక్కి జనరల్ ట్యాబ్ లో ఉన్న లాంగ్వేజీ సెట్టింగ్స్ లో తెలుగును ఎంచుకోండి. అంతే జీమెయిల్ తెలుగులో రెడీ!